శంకరపూర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

శంకరపూర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి మండలం శంకరపూర్ లో ఈరోజు వేకువజామున కోటపెల్లి పోలీసులు కమ్యూనిటీ కంటాక్ట్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసారు. సరియైన పత్రాలు లేని పలువురికి చెందిన వాహనాలకు జరిమానా విధించారు.

ఈ సందర్బంగా చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ మాట్లాడుతూ.. సైబర్ క్రైమ్, డ్రగ్స్, గంజాయి, గుడుంబా వలన కలిగే అనర్ధాలను యువకులకు వివరించారు. ఈకార్యక్రమంలో చెన్నూరు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ నీల్వాయి ఎస్సై జగదీష్ కోటపల్లి, నీల్వాయి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.