సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ రెడ్డిని పరిచయం చేసిన మంత్రి శ్రీహరి

సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ రెడ్డిని పరిచయం చేసిన మంత్రి శ్రీహరి

ఊట్కూర్, ఆంధ్రప్రభ:

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు వచ్చిన రేవంత్ రెడ్డిను ఊట్కూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేష్ రెడ్డి గురువారం కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పాడి పరిశ్రమల, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకాటి శ్రీహరి మహేష్ రెడ్డిని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు.

మహేష్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తయితే సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు చేరేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం లభించడం తనకు ఆనందంగా ఉందని మహేష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.