సీపీఆర్ తో నిలిచిన నిండు ప్రాణం
సీపీఆర్ తో నిలిచిన నిండు ప్రాణం
- చాకచక్యంగా స్పందించిన కోర్టు కానిస్టేబుల్
- అభినందించిన జిల్లా ఎస్పీ మహేశ్ బి.గితే
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : జిల్లా కోర్టు ఆవరణలో గుండె నొప్పితో కుప్పకూలిని వ్యక్తికి సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం సిరిసిల్ల జిల్లా కోర్టులో హాజరయ్యేందుకు ఇల్లంతకుంట మండలం కట్కూరు గ్రామానికి చెందిన వెంకటేశం వచ్చాడు. కోర్టు ఆవరణలో ఆకస్మాత్తుగా గుండె నొప్పితో కుప్పకులగా అక్కడే ఉన్న కోసరావు పేట పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ సకాలంలో స్పందించారు.
అప్పటికప్పుడే స్పందించిన భాస్కర్ సీపీఆర్ చె యడంతో బాధితుడు సృ్పహలోకి రావడంతోపాటు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చాకచక్యంగా వ్యవహరించడంతో వెంకటేశం ప్రాణాలతో బయటపడ్డారు. సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ను నెటిజన్లు అభినందిస్తున్నారు. గుండెపోటు వచ్చిన వారికి తక్షణం సాయపడేలా పోలీసులకు ఉన్నతాధికారులు ఇప్పించిన సీపీఆర్ శిక్షణ ఓ నిండు ప్రాణం నిలబెట్టింది.
