తప్పిన పెను ప్రమాదం
తప్పిన పెను ప్రమాదం
ఈదురుగాలులకు విరిగిపడిన విద్యుత్ స్తంభం
పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని శనగపాడు గ్రామంలో బుధవారం సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభం విరిగి రోడ్డుపై అడ్డంగా పడిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ప్రజలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభం రోడ్డుపై పడిపోవడంతో కొంతసేపు స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న స్థానిక విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని విరిగిన స్తంభాన్ని తొలగించారు. అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన మరమ్మతు పనులు చేపట్టారు.
