అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు

అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ:
రాష్ట్రంలోని అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి అన్నారు. నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా మంజూరైన ఇందిరమ్మ గృహాలలో నిర్మాణం పూర్తయిన ఇళ్లను సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొణతం చిన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. మంజూరైన లబ్ధిదారులు సకాలంలో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అర్హులైన వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సోమసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, సర్పంచ్ బుర్రి శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ నరసింహారావు, మోదాల సైదులు, కే సూరిబాబు, నన్నేపంగ శీను, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.