ఆరెగూడెంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

ఆరెగూడెంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
చౌటుప్పల్ మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామపంచాయతీలో పిసాటి లక్ష్మి నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆరెగూడెం గ్రామ సర్పంచ్ ఎన్నెపల్లి ధనలక్ష్మి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ధనలక్ష్మి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. రాబోయే రోజుల్లో గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నిమ్మల సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ జాల మల్లేష్ యాదవ్, వార్డు సభ్యులు గంగనబోయిన శ్రీశైలం, పల్లె లింగస్వామి, గంగనబోయిన వెంకటేశం, అనంతుల వెంకటేశం, మారగోని రాధిక, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పిసాటి నాగరాజు రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.