బాలికల నీటి సమస్యకు చెక్
బాలికల నీటి సమస్యకు చెక్
స్పందించిన వైస్ చైర్‌పర్సన్ లావణ్య
సొంత నిధులతో సింటెక్స్ ట్యాంక్ బహుకరణ..
డోర్నకల్, ఆంధ్రప్రభ: విద్యార్థినుల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డోర్నకల్ మున్సిపాలిటీ వైస్ చైర్‌పర్సన్ మాద లావణ్య శ్రీనివాస్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని మైనార్టీ గురుకుల బాలికల ఒకేషనల్ కళాశాలకు స్వంత ఖర్చులతో సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ను అందజేశారు. కళాశాలలో తాగునీటి నిల్వ సమస్య తలెత్తకుండా ముందస్తుగా స్పందించి విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సహాయం చేశారు.
ఈ చర్య పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ప్రజాప్రతినిధిగా సామాజిక బాధ్యతతో చేసిన ఈ మానవతా సేవ ఆదర్శనీయమని స్థానికులు కొనియాడుతున్నారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దాసరి స్వప్న, అధ్యాపక సిబ్బంది, విద్యార్థినుల తల్లిదండ్రులు మాద లావణ్య శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు విద్యా సంస్థల అభివృద్ధికి ఆమె అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు.
