రైలు నుండి బ్యాగుపడిపోవడంతో..

రైలు నుండి బ్యాగుపడిపోవడంతో..

కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిఆర్పి పోలీసుల తక్షణ స్పందనతో గుడివాడకు చెందిన ప్రయాణకురాలు తను పోగొట్టుకున్న బ్యాగును పోలీసులు అప్పగించారు. గురువారం తెల్లవారుజామున ట్రైన్ నెంబర్12749 బీదర్ ఎక్స్ప్రెస్ నందు ప్రయాణం చేస్తున్న గుడివాడకు చెందిన గెల్లి శ్రీదేవి ఒప్పో కంపెనీ మొబైల్, నగదు గల సిమెంట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ తెల్లవారుజామున 02:00 గంటల సమయాన చింతలపల్లి వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య వరంగల్ రైల్వే స్టేషన్ కు రెండు కిలోమీటర్ల దూరంలో జారి పడిపోయినాదని జిఆర్ పి పోలీస్ స్టేషన్ వరంగల్ నందు ఫిర్యాదు చేసారు.

ఐఆర్ పి IRP-వరంగల్ పి సురేందర్ ఉత్తర్వుల మేరకు హెడ్ కానిస్టేబుల్ కె భాస్కర్, ఆన్ డ్యూటీ కానిస్టేబుల్స్ అయిన ఎండి.నయీం పాషా, ఎస్.కె పాషాలను అట్టి హ్యాండ్ బ్యాగ్ వెతుకుటకు వరంగల్ రైల్వే స్టేషన్ నుండి ధర్మారం గేటు వైపు పంపగా ట్రాక్ నందు వెతికి ఉదయం 07:00 గంటలకు 30,000/- విలువ గల మొబైల్, 10,000 నగదు ఇతర వస్తువులు గల హ్యాండ్ బ్యాగ్ ను వెతికి పట్టుకొని బాధితురాలు గెల్లి శ్రీదేవికి అప్పగించడం జరిగిందని సీఐ తెలిపారు.