Dumping Yard | సిద్ధాపూర్ గ్రామస్తుల “చలో కలెక్టరేట్” పాదయాత్ర
Dumping Yard | సిద్ధాపూర్ గ్రామస్తుల “చలో కలెక్టరేట్” పాదయాత్ర
Dumping Yard | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐటీ కంపెనీలు వస్తాయని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను డంపింగ్ యార్డ్ కోసం ఉపయోగించేందుకు ప్రతిపాదించడం పట్ల సిద్దాపూర్ గ్రామ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు పరిశ్రమలు, ముఖ్యంగా ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం కేటాయించారని, కానీ ఇప్పుడు అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని అధికారులు యోచించడం తమకు అన్యాయమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై నిరసనగా గ్రామ ప్రజలు “చలో కలెక్టరేట్” పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ నాయకత్వం వహించారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేసి, ముందుగా ఇచ్చిన హామీల ప్రకారం ఐటీ పరిశ్రమల అభివృద్ధికే భూములను వినియోగించాలని గ్రామస్థులు స్పష్టం చేశారు.
