వందే భారత్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకున్న మంత్రి జూపల్లి..

- సీఎం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమ్రం భీం-ఆసిఫాబాద్ జిల్లా పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ఆదివారం సికింద్రాబాద్ నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కాగజ్‌నగర్‌కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది, వ్యక్తిగత కార్యదర్శితో కలిసి సాధారణ ప్రయాణికుల మధ్య ప్రయాణించిన మంత్రి రైలులోనే భోజనం చేస్తూ తోటి ప్రయాణికులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
నేటి రాజకీయ పరిస్థితుల్లో అనేక మంది ప్రజాప్రతినిధులు, ఉన్నత హోదాల్లో ఉన్న నాయకులు స్వల్ప దూరాలకే హెలికాప్టర్లను వినియోగిస్తున్న తరుణంలో, హైదరాబాద్ నుండి రాష్ట్రంలోనే అత్యంత దూర ప్రాంతాల్లో ఒకటైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సైతం మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వ్యక్తిగతంగా హెలికాప్టర్‌ను వినియోగించకుండా రైలు మార్గాన ప్రయాణించడం ఆయన నిరాడంబరతకు, ప్రజాధనంపై ఉన్న బాధ్యతకు నిదర్శనం. ప్రజల డబ్బు ఆదా చేయడం, ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో ప్రజా రవాణాను వినియోగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కాగజ్‌నగర్ చేరుకున్న అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన సభా ప్రాంగణం, హెలిపాడ్, పార్కింగ్ ప్రాంతాలు, వేదిక ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను పరిశీలించి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 1నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడలో ఇందిరమ్మ ఇళ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
