పోలీసు బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ..

పోలీసు బందోబస్తును పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ..

నిర్మల్, ఆంధ్రప్రభ : జగ్నీకి రాత్ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని మసీదుల వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన మసీదులైన గుల్జార్ మసీదు, జామ మసీదులను సందర్శించిన జిల్లా ఎస్పీ, అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముస్లిం సోదరులు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించుకునేలా భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని సూచించారు.

మసీదులకు ప్రార్థన నిమిత్తం వచ్చే సోదరులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్శనలో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ తో పాటు, నిర్మల్ ఏఎస్పీ సాయి కిరణ్, ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు కృష్ణ, సమ్మయ్య, ఎస్.ఐ లు రవీందర్, నర్సయ్య సిబ్బంది ఉన్నారు.