ఆటతో అమరవీరులకు ఘన నివాళి..

ఊర్కొండ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారకార్థం ఊర్కొండపేట జెడ్పీహెచ్‌ఎస్ మైదానంలో ఎంకేజీ యువసేన ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు మట్ట కృష్ణ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్‌ను ప్రారంభించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

క్రీడాకారులతో పరిచయం చేసుకున్న ఆయన, ఇరు జట్లకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, నిర్వాహకులు, క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.