బ్యాక్ వాటర్ తో నిలిచిపోయిన రాక పోకలు

బ్యాక్ వాటర్ తో నిలిచిపోయిన రాక పోకలు
బాసర, ఆంధ్రప్రభ : గోదావరి బ్యాక్ వాటర్(Back water)తో భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయం నుండి గోదావరి నది వరకూ ఉన్నరోడ్డు మార్గం ఈ రోజు వరదనీటితో మునిగిపోయింది. దీంతో భక్తులు పుణ్యా స్నానాల కోసం గోదావరి(Godavari) వద్దకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత మూడు రోజులుగా వరద నీరు పెరుగుతుండడంతో భక్తులు(Devotees) ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు, వాహనాలు వెళ్లకుండ పోలీసులు(Police) చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్ర(Maharashtra) భక్తులు వరద నీటి నుండి నడుచుకుంటూ వెళ్లి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భక్తులు వెళ్లేందుకు ఉచిత బస్సు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.

