నీటి ఎద్దడి నివారణకు చర్యలు..
జైనూర్, ఆంధ్రప్రభ : నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ అన్నారు. జైనూ ర్ మేజర్ గ్రామపంచాయతీ నిధులతో పంచాయతీలోని మోమిన్ పుర, సోను పటేల్ గూడలో నువ్వు తినంగా వేసిన తాగునీటి బోర్ వెల్స్ ను శనివారం ఆయన పరిశీలించారు. నూతన బోర్వెల్ ద్వారా నీటి సరఫరా విషయాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తేవాలని సర్పంచ్ కొడప ప్రకాష్ ప్రజల కు కోరారు. పంచాయతీలోని ఏ సమస్యలు తలెత్తిన వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలు నేరుగా వచ్చి సమస్యలు ఉంటే తెలుపాలని సర్పంచ్ కోరారు.
