సీసీ కెమెరాలు ప్రతి షాప్ వద్ద వ్యాపారులు ఏర్పాటు చేయాలి
- ప్రజల సామాజిక భద్రతకు సహకరించాలి
- బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్
బెల్లంపల్లిటౌన్, ఆంధ్రప్రభ: దినదిన అభివృద్ధి చెందుతున్న బెల్లంపల్లి పట్టణంలో నీ బజార్ ఏరియాలో వ్యాపారులు ట్రాఫిక్ నియమాలు పాటించడంతోపాటు ప్రజల సామాజిక భద్రతకు ప్రతి షాపు ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ సూచించారు. బుధవారం సాయంత్రం బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో మున్సిపల్ చైర్ పర్సన్ దావస్వాతి, కమిషనర్ తన్నీరు రమేష్ ఏసిపి కిరణ్ కుమార్ లతో సబ్ కలెక్టర్ పర్యటించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సామాజిక భద్రత రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అన్నారు. బజార్ ఏరియాలో ట్రాఫిక్ నీ మన పాటించాలని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడాలని ఈ విషయం ఉల్లంఘించిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని 15 మంది వ్యాపారులకు ఈ సందర్భంగా నోటీసులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సిఐ సిహెచ్ హ నోక్, తదితరులు పాల్గొన్నారు
