పేకాట శిబిరంపై పోలీసుల దాడి..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిరుమల హిల్స్ సమీపంలోని ఆర్‌పీ గార్డెన్స్‌లో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని తాళ్లగురిజాల పోలీసులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం, ఆర్‌పీ గార్డెన్స్‌లో పేకాట నిర్వహిస్తున్నారనే రహస్య సమాచారం అందడంతో ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి పేకాట శిబిరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి రూ.1,28,240 నగదు, ఎనిమిది సెల్‌ఫోన్లు, 104 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్ట్ అయిన వారిలో ఎం.డి. ఆఫీజ్, జే. క్రాంతికుమార్, తొంగల వెంకటేష్, డి. శ్రీనివాస్, ఏ. పోశం, గొడిసెల మణిరాజ్, గాజు గంగాధర్, సింగతి రవి, సలేందర్ కేశవ్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.