ఆలయంలో చోరీ..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పుప్పాల హనుమాన్ ఆలయంలోని హుండీ చోరికి గురైంది. శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకలు గల హుండీని పగులకొట్టి అందులోని సుమారు పదివేల నగదును అపహారించుకు వెళ్లారు.