జాతీయ వేదికపై గుస్సాడి కళా ప్రదర్శనలు
జాతీయ వేదికపై గుస్సాడి కళా ప్రదర్శనలు
జైనూర్, ఆంధ్రప్రభ: పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన స్పిక్ మాకే 11వ జాతీయ కన్వెన్షన్ సాంస్కృతిక ఉత్సవాల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన పద్మశ్రీ కనకరాజు గుస్సాడి బృందం కళాకారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆదివాసీ గుస్సాడి, దండారి కళా ప్రదర్శనలు నిర్వహించినట్లు పద్మశ్రీ గుస్సాడి బృందం టీమ్ లీడర్ కనక సుదర్శన్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధికారుల ఆహ్వానం మేరకు ఈ వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలు చేసినట్లు చెప్పారు. మారుమూల ప్రాంతానికి చెందిన ఆదివాసీ గుస్సాడి నృత్యాన్ని జాతీయ వేదికపై ప్రదర్శించడం గర్వంగా ఉందని బృందం ఇన్‌చార్జి కనక సుదర్శన్ అన్నారు.
ఈ ప్రదర్శనల్లో గుస్సాడి కళాకారులు కుంరం సాయిరాజ్, మడవి బోవెన్‌రావు, అర్కా సాంబాజీరావు, మెస్రం నోవునాథ్, అడా భగవంతరావు, ఎర్మా కీర్తనరావు, ఆత్రం హనుమంతు, ఆత్రం చందు, జూగనాక శేకు, ఆత్రం సాయిరాం, పంధ్ర శ్రీను, కుంరం ప్రభు, అడా రవి పాల్గొన్నారని కనక సుదర్శన్ తెలిపారు.

