చెన్నూరులో మంత్రి వివేక్ వివాహ వార్షికోత్సవం

చెన్నూరులో మంత్రి వివేక్ వివాహ వార్షికోత్సవం

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి – సరోజ దంపతుల వివాహ దినోత్సవ వేడుకలను చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.

మంత్రి దంపతుల వివాహ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు స్థానిక అగస్త్యేశ్వర ఆలయం, జగన్నాథ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేసి మంత్రిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్‌పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్, కౌన్సిలర్లు అంబటి శంకర్, అజీమోద్దీన్, బి. కరుణసాగర్ రావు, హేమంత్ రెడ్డిలతో పాటు పార్టీ నాయకులు చెన్న సూర్యనారాయణ, సుద్దపిండి సుశీల్ కుమార్, చెన్నూరి రాజేష్, కరెంగుల శ్రవణ్, మహేష్, కరీం, కమలాకర్, ఆతిఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply