హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా మహానాడు వేడుకలు..

హౌసింగ్ బోర్డు కాలనీలో ఘనంగా మహానాడు వేడుకలు..

ఎన్టీఆర్‌కు ఘన నివాళులు

భవానిపురం, ఆంధ్రప్రభ : హౌసింగ్ బోర్డు కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ కార్యాలయంలో 41, 42 డివిజన్ల క్లస్టర్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

క్లస్టర్ ఇంచార్జీ యేదుపాటి రామయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి డివిజన్ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావు, సంతోష్, ఖాదర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా యేదుపాటి రామయ్య మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి క్లస్టర్ పరిధిలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు.

ముఖ్యంగా ‘శ్రీశక్తి’ పథకాల ద్వారా మహిళలకు సమాజంలో ప్రథమ స్థానం కల్పిస్తూ వారికి పెద్దపీట వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఖాదర్, నెలకుర్తి వెంకట్రావు, యూనిట్ ఇంచార్జీలు స్రవంతి, రమేష్, కో-యూనిట్ ఇంచార్జీ సురేష్, బూత్ ఇంచార్జీలు, ప్రతినిధులు మువ్వ విజయ, కాళిదాసు, ఫణి, బిందు, మల్లీశ్వరి, ప్రసాద్, అలీ, నజీబ్ తదితరులు పాల్గొన్నారు.