వైఎస్సార్‌కు ఘన నివాళులు

77వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల
కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన వైసీపీ నేతలు

చల్లపల్లి, ఆంధ్రప్రభ: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా చల్లపల్లి ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేత, యువనేత సింహాద్రి వికాస్ వైఎస్సార్‌కు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు పాల్గొన్నారు.