Director | ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్..
Director | ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్..
Director | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హిట్ మిషన్ అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో మధ్య విభేదాలు తలెత్తాయా..? ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి మొదట భీమ్స్‌ను సంగీత దర్శకుడిగా అనుకున్నారని, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌లోకి వేరే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారని.. అందుకనే విభేదాలు అంటూ వార్తలు వస్తుండడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతకీ.. ఏమైంది..? భీమ్స్ ప్లేస్ లో వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?

Director | రెమ్యూనరేషన్ గురించే విభేదాలా..?
ఇటీవల వరుస హిట్ ఆల్బమ్స్‌తో మంచి ఫామ్‌లో ఉన్న భీమ్స్.. ముఖ్యంగా మాస్, ఫోక్ బీట్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అనిల్ రావిపూడి సినిమాలకు కూడా ఆయన సంగీతం బాగా సెట్ అయ్యింది. అయితే.. ఇప్పుడు వచ్చిన మార్పు షాక్ ఇస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ స్టైల్ విషయంలో అనిల్ – భీమ్స్ మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినట్లు టాక్ వినిపించింది. అలాగే భీమ్స్ రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేసాడని.. ఆ కారణంగానే ఇద్దరి మధ్య విభేదాలని అందుకనే.. అనిల్ రావిపూడి చివరి నిమిషంలో సంగీత దర్శకుడిని మార్చేశారనే ప్రచారం జరుగుతోంది.

Director | భీమ్స్ ప్లేస్ లో జీవీ ప్రకాష్ కుమార్…?
భీమ్స్ ప్లేస్ లో ఎవర్ని తీసుకున్నారంటే.. జీవీ ప్రకాష్ కుమార్ పేరు గట్టిగా వినిపిస్తోంది. తీసుకోవడం వెనుక పాన్ ఇండియా మార్కెట్ కోణం కూడా ఉందన్న చర్చ నడుస్తోంది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉన్న జీవీ ప్రకాష్ ఉంటే సినిమాకు మరింత రీచ్ వస్తుందని మేకర్స్ భావించినట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై ఇప్పటి వరకు అనిల్ రావిపూడి గానీ, భీమ్స్ గానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో నిజంగానే ఇద్దరి మధ్య గొడవ జరిగిందా..? లేక ఇది కేవలం ప్రొఫెషనల్ నిర్ణయమేనా..? అన్నది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మాత్రం “భీమ్స్‌ను ఎందుకు తప్పించారు?”, “అనిల్-భీమ్స్ మధ్య ఏమైంది?” అనేది ఆసక్తిగా మారింది. ఈ వార్తల పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

CLICK HERE TO READ Tollywood actor | అనాథాశ్రమంలో సేవా కార్యక్రమాలు
