Harish Rao Press Meet | పార్టీలు మార్చే ఊస‌ర‌వెల్లి రేవంత్..

Harish Rao Press Meet | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : సీఎం రేవంత్ రెడ్డి పార్టీలు మార్చే ఊస‌ర‌వెల్లి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీశ్ రావు అన్నారు. హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ… సొంత పార్టీ నేత‌ల‌నే తొక్కుకుంటూ వ‌చ్చిన చ‌రిత్ర రేవంత్ ది అన్నారు. జాతి, నీతి, విలువ‌లు లేని నాయ‌కుడివి నీవేన‌న్నారు. పార్టీ అంటే నాకు క‌న్న‌త‌ల్లిలాంటిద‌న్నారు. మా నాయ‌కుడు ఆదేశిస్తే ప‌ద‌వుల‌ను గ‌డ్డిపోచ‌లా వ‌దిలేశాన‌న్నారు.

కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టడం అంటే అతను ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో పనిచేస్తున్నాడో అర్థం అవుతుందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి అయి రెండేళ్లు అయినా… ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటూ సగం సగం ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర పరువు తీస్తున్నాడన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేసీఆర్‌ మాట్లాడారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆర్థిక అరాచకత్వమని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కానీ.. గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన పిలిచిన అతిథులే తెలంగాణ అద్భుత ఆర్థిక ప్రగతి సాధించిందని కొనియాడారని గుర్తుచేశారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టి సాధించిందన్నారు. రాజకీయాల కోసం రాష్ట్రం పరువు తీయొద్దని కోరారు.

Leave a Reply