అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం..

అగ్ని ప్రమాద బాధిత రైతులకు అండగా ఉంటాం..

ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి

తొర్రూరు, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: అగ్ని ప్రమాదంలో మామిడి తోట నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి తెలిపారు.

మండలంలోని మాటేడు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మామిడి తోట దగ్ధమైంది. ఘటన స్థలాన్ని తహసిల్దార్ గడీల శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి పరిశీలించారు.

బాధిత రైతును కలిసి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా తిరుపతిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతులకు అగ్ని ప్రమాదాల వల్ల తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని అన్నారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు పరామర్శించడం, వారిలో ధైర్యం నింపడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాటేడు గ్రామ మాజీ సర్పంచ్ వల్లపు యాకయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, కల్వకొలను సురేందర్ రాజు, నరేందర్ రెడ్డి, చర్లపాలెం సర్పంచ్ ధర్మారపు మహేందర్, చర్లపాలెం కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి, ఉప సర్పంచ్ జినుగ రవీందర్ రెడ్డి, బీరెల్లి మహేందర్ రెడ్డి, ఎద్దు మహేష్ తదితరులు పాల్గొన్నారు.