నిత్య అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం

నిత్య అన్నదాన పథకానికి రూ.1.01 లక్షల విరాళం
ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి:
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి మాజీ రీజినల్ జాయింట్ కమిషనర్, దేవాదాయశాఖ, మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. భ్రమరాంబ రూ.1,01,000 విరాళం అందజేశారు. అమ్మవారిపై భక్తిశ్రద్ధలతో నిత్య అన్నదాన పథకానికి ఈ విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య టెంపుల్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, విరాళ రసీదును అందజేశారు.
