సేవా తత్పరులంతా రెడ్ క్రాస్ లో చేరాలి

సేవా తత్పరులంతా రెడ్ క్రాస్ లో చేరాలి
మోత్కూరు, ఆంధ్రప్రభ: సేవాతత్పరులంతా అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలని రెడ్ క్రాస్ సొసైటీ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ డాక్టర్ గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు.
జూన్ 15 వరకు నిర్వహిస్తున్న రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం మోత్కూరు సీఐ వెంకటేశ్వర్లుకు శాశ్వత సభ్యత్వ కార్డును అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భువనగిరిలోని రెడ్ క్రాస్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక డేటా సెంటర్ ఏర్పాటు చేసి సభ్యత్వాలను స్వీకరిస్తున్నట్లు వివరించారు.
సమాజ సేవ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్‌లో చేరి స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పేదలకు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలో ఉన్న వారికి సేవ చేయడానికి రెడ్ క్రాస్ అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. రక్తదానం ప్రోత్సహణలో, అత్యవసర పరిస్థితుల్లో రక్త సరఫరా చేయడంలో సంస్థ ముందంజలో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా డైరెక్టర్ కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్.ఎన్. చారి, యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బీసు మచ్చగిరి, మాజీ సర్పంచ్ చేతరాశి అంజయ్య, ఏఎస్ఐ వెంకన్న, హెడ్ కానిస్టేబుల్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
