కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి..

కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి..
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి సమయంలో నున్న వైపు నుండి ఓ కారు కండ్రిక వైపు వస్తుండగా, అటుగా కోరాడ వాసు అనే వ్యక్తి తన సొంత పనులు పూర్తి చేసికొని తన ద్విచక్ర వాహనం పై కండ్రికకు వస్తున్నాడు.
అయితే.. ద్విచక్ర వాహనదారుడిని కారు వెనుక నుండి ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో కారు, బైకును సుమారు పది మీటర్ల వరకు రోడ్డు పై ఈడ్చుకొంటూ వెళ్ళింది. అందుకు రోడ్డు పై చారలు ఇంకా ఉన్నాయి. కారు, బైక్ నుజ్జునుజ్జు అయ్యింది. మృతుడు వాసుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

