వైసిపి నాయకుడు జజ్జువరపు భాగ్యరావు హఠాన్మరణం

వైసిపి నాయకుడు జజ్జువరపు భాగ్యరావు హఠాన్మరణం

శనివారం ఉదయం కరెంట్ షాక్ తగిలి ప్రమాదం

చల్లపల్లి, ఆంధ్రప్రభ : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జుజ్జువరపు భాగ్యరావు శనివారం ఉదయం కరెంట్ షాక్ గురై హఠాన్మరణం పొందారు. మంగళాపురం గ్రామానికి చెందిన జుజ్జువరపు భాగ్యరావు పార్టీలో ఎంతో చురుగ్గా పనిచేసేవారు. భాగ్య రావుకు భార్య, కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రస్తుతం పదవ తరగతి చదువుతోంది. భాగ్యరావు మృతి పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అందరితో కలివిడిగా ఉండి ఆప్యాయంగా పలకరించే భాగ్యరావు మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు.
*దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన చల్లపల్లి మండలం జెడ్పిటిసి సభ్యురాలు రాజులపాటి కళ్యాణి శివప్రసాద్ దంపతులు.

జుజ్జువరపు భాగ్యరావు పార్టీలో ఎంతో యాక్టివ్ గా పని చేస్తూ అందరితో కలివిడిగా ఉండే భాగ్యరావు మృతి చెందడాన్ని నమ్మలేకపోతున్నామని మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న భాగ్యరావు మృతి పార్టీకి తీరని లోటు.