ఘనంగా పీసీసీ జన్మదిన వేడుకలు

భీమ్‌గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం రహత్ నగర్ బిడ్డ, పీసీసీ చీఫ్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు ఆదివారం భీమ్‌గల్ మండల అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ అధ్యక్షులు ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పుట్టినరోజు వేడుకలకు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ముత్యాల కేక్ కట్ చేశారు.

పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు బాల్కొండ నియోజకవర్గం ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పీసీసీ అధ్యక్షులు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలతో ఉంచాలని అన్నారు.ఈ సందర్బంగా వెయ్యి మందికి అన్నదానం ఏర్పాటు చేయగా ముత్యాల స్వయంగా అన్నదానం ప్రారంభం చేసి పలువురికి వడ్డన చేశారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ పర్శ అనంత్ రావు, మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు ఆరిగేల జనార్దన్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్, మున్సిపల్ 11 వ వార్డు కౌన్సిలర్ సంగ్యా నాయక్, సర్పంచ్ ఫోరం మండల ఉపాధ్యక్షుడు భూక్య రమేష్, ప్రధాన కార్యదర్శి పిండి మనుషా, అశోక్ గౌరవ అధ్యక్షులు శ్రీరామ్ సుమలత, సర్పంచ్ ఫోరం కార్యదర్శి దుమాల మమత రాజు, క్యాషియర్ ఎం.ఏ సమీర్, చరణ్ గౌడ్, కుంట రమేష్, వెన్నెల బాలమణి జనార్ధన్, లకవత్ తిరుపతి, మలవత్ పూజ అజయ్, బుర్ర సుమ దేవేందర్ గౌడ్, భూక్య సర్దార్, వసుంధర్, అమీనా, భూక్యా అమ్సీబాయి రాజారెడ్డి, శివ, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.