డేంజర్ అలెర్ట్..!
డేంజర్ అలెర్ట్..!
ఏలూరు జిల్లాలో ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు
ఏలూరు, మే 24 (ఆంధ్రప్రభ): ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
తీవ్రమైన ఎండలు, వేడిగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రద్దీ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో మంచినీటి చలివేంద్రాలు, శీతలీకరణ షెల్టర్లు ఏర్పాటు చేయాలని, ప్రజలకు తగిన నీడ కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
