పలు బాధిత కుటుంబాలను పరామర్శ..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మరపల్లి మండలంలో పలు బాధితుల కుటుంబలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు. అమీర్ నగర్ గ్రామంలో రాజుల రమేష్ వాళ్ల అన్న ఇటీవల మరణించారు. వారి కుటుంబంన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. కొనసాముందర్ గ్రామంలో లాడే అశోక్ వాళ్ల కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు.వారిని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట కమ్మర్ పల్లి మండల అధ్యక్షుడు బోనగిరి భాస్కర్,మాజీ మండల అధ్యక్షులు సుంకేట రవి,వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
