missing | 82మంది మృతి.. పలువురు గల్లంతు

missing | 82మంది మృతి.. పలువురు గల్లంతు

missing | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : చైనాలోని లియుషెన్యూ బొగ్గుగనిలో ఘోర పేలుడు సంభవించింది. ఇవాళ జరిగిన ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 82 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

తొలుత ప్రమాదంలో తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు సమాచారం వచ్చినప్పటికీ.. అనంతరం మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇంకా 9మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి.

ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలపై తక్షణమే సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

Leave a Reply