Launches Sanjeevani : త్వరలోనే ఏఐ డాక్టర్ Andhra Prabha Top News

Launches Sanjeevani : త్వరలోనే ఏఐ డాక్టర్ Andhra Prabha Top News
- సంజీవని సందడి
- ఆగస్టు 15 నుండి ఏపీ మొత్తం అమలు
- సంపద కంటే ఆరోగ్యం గొప్పది
- చిత్తూరు జిల్లా కండ్రిగలో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రభ, పూతలపట్టు

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పూతలపట్టు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెలిపాడ్ వద్ద స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ప్రివెంటివ్, ప్రిడెక్టివ్, క్యూరేటివ్ విధానంలో సమగ్ర వైద్య సేవలు అందేలా సంజీవని కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం అమలు చేస్తోంది.
సంజీవని హెల్త్ కార్డుతో వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను వైద్యులు పర్యవేక్షించేలా కార్యాచరణ చేపట్టారు.
Launches Sanjeevani : ఆగస్టు 15 నుంచి ….

ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, అత్యుత్తమ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేలా ఈ సంజీవని కార్యక్రమం చేపట్టాం. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన ఔషధి సంజీవని. అందుకే ఆ సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆలోచన చేశాం, అని ఆయన వివరించారు.
సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే ఆదృష్టవంతులు.. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలున్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించాం, అని సీఎం స్ఫష్టం చేశారు. వ్యాధులు రాకముందే హెచ్చరించి దానికి అనుగుణంగా చికిత్సలు అందేలా చేయటమే నిజమైన అభివృద్ధి, జూలైలో కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్ గా ప్రారంభించి మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో చేపట్టాం. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించాం. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరోగ్యానికి అవసరమైన ప్రతీ అంశాన్ని సంజీవని ప్రాజక్టు ద్వారా పర్యవేక్షిస్తాం. డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్ గా మార్చి పర్యవేక్షణ చేస్తున్నాం అని సీఎం చెప్పారు.
Launches Sanjeevani : త్వరలోనే ఏఐ డాక్టర్

త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా వైద్యసేవలు పొందేలా చర్యలు చేపడుతున్నాం, సంజీవని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన సిటిజన్ వెల్ నెస్ మిషన్. ఇల్ నెస్ నుంచి వెల్ నెస్ కేర్ కోసం సంజీవని ప్రాజెక్టు ఏర్పాటు చేశాం. సంజీవని అనేది ఓ సాఫ్ట్ వేర్ మాత్రమే కాదు అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ హెల్త్ ఆపరేటివ్ సిస్టమ్ అత్యుత్తమ వైద్య సేవలతో పాటు ఆధునిక వైద్యం ఇంటి వద్దే వర్చువల్ గా అందించేలా సంజీవని ప్రాజెక్టును తీసుకువచ్చాం. అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ALSO READ : Ap Cm Serious : గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ Andhra Prabha Top Story
