తునికి ఆకు సేకరణకు వెళ్లి పాము కాటుతో మహిళ మృతి

తునికి ఆకు సేకరణకు వెళ్లి పాము కాటుతో మహిళ మృతి
కొత్తగూడ, ఆంధ్రప్రభ : తునికాకు సేకరణకు వెళ్లి పాము కాటేయడంతో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మండలంలోని కర్ణ గండి గ్రామానికి చెందిన మద్దెల పల్లవి (35) మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మద్దెల పల్లవి రోజువారీగా గురువారం కూడా సేకరణ కోసం అడవికి వెళ్లారు. ఆకులను సేకరిస్తున్నాను పొదల్లో ఉన్న విషపూరితమైన పాము ఆమెను కాటు వేసింది. పరిసర ప్రాంతాల్లో ఆకు సేకరిస్తున్న వారికి విషయం చెప్పి కుటుంబ సభ్యులను సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పాము విషం శరీరం అంత పాకడంతో పరిస్థితి విషమించి పల్లవి ఆసుపత్రిలోనే కనుమూశారు. మృతురాలికి భర్త సారయ్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్దెల పల్లవి మృతితో కర్నాగండి గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.
