గ్రామీణాభివృద్ధికి వాటర్ షెడ్ పాత్ర కీలకం
గ్రామీణాభివృద్ధికి వాటర్ షెడ్ పాత్ర కీలకం
- నీటి వనరుల వినియోగం, భూసార పరిరక్షణపై నిపుణుల అవగాహన
- హైదరాబాద్‌లో మూడు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం
- పాల్గొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎపిఓ, టెక్నీకల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరుల సమర్థ వినియోగం, భూసార పరిర క్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు వాటర్ షెడ్ కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బుధ వారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మూడు రోజులపాటు వాటర్ షెడ్ నిర్వహణ ప్రణాళిక తయారీపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ శిక్షణలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలానికి చెందిన ఏపీవో ప్రేమ య్య, టెక్నికల్ అసిస్టెంట్ జాంబ, పంచాయతీ కార్యదర్శి అవినాష్ పాల్గొని పలు అంశాలపై అవగాహన పొందారు. శిక్షణలో భాగంగా వాట ర్ షెడ్ అభివృద్ధి ప్రణాళిక రూపొందింపు విధానం, గ్రామ స్థాయిలో నీటి వనరుల అంచనా, వర్షపు నీటి నిల్వ పద్ధతులు, చెక్‌డ్యామ్‌లు, పర్కొ లేషన్ ట్యాంకులు, కుంటల పునరుద్ధరణ వంటి అంశాలను వివరించా రు.
అలాగే భూసార పరిరక్షణకు సంబంధించిన కాంటూర్ బండింగ్, ట్రెంచింగ్, వృక్షారోపణ వంటి పద్ధతులపై కూడా ప్రాక్టికల్‌గా శిక్షణ అందించారు. గ్రామాల్లో సహజ వనరులను సమగ్రంగా వినియోగించు కునేందుకు ప్రజల భాగస్వామ్యం ఎంత ముఖ్యమో కూడా ఈ శిక్షణలో వివరించారు. రైతులు, గ్రామస్తులు, స్థానిక సంస్థలు కలిసి పనిచేసిన ప్పుడే వాటర్ షెడ్ ప్రణాళికలు విజయవంతమవుతాయని నిపుణులు సూచించారు.
