బాధిత పశు రైతులకు నష్టపరిహారం చెక్కుల అందజేత

కడెం, ఆంధ్రప్రభ : గత సంవత్సరం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన రైతుల గేదెలు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది.

ఉడుంపూర్ గ్రామానికి చెందిన మెంగని సువర్ణ, ఘర్షకుర్తి మహేష్, బెడద సంజీవ్ రైతులకు చెందిన మొత్తం నాలుగు గేదెలు కరెంట్ షాక్‌తో మృతి చెందాయి. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా ఒక్కో గేదెకు రూ.40 వేల చొప్పున మొత్తం రూ.1.60 లక్షల నష్టపరిహారం మంజూరు చేసింది.

శుక్రవారం ఉడుంపూర్ గ్రామ సర్పంచ్, కడెం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్త, విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ సతీష్ కలిసి బాధిత రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.