నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు…

  • ఎంఈఓ మంత్రి రాజు

దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రైవేటు పాఠశాల యజమాన్యం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంఈఓ మంత్రి రాజు అన్నారు మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇన్‌ఛార్జ్ డీఈఓ చంద్రయ్య ఆదేశాల మేరకు, దండేపల్లి మండల విద్యాధికారి మంత్రి రాజు బుధవారం మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బ్రిలియంట్ మోడల్ స్కూల్, వాసవి స్కూల్, ప్రగతి స్కూల్, మదర్ తెరిసా పాఠశాలల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం ఫీజుల వివరాలు రికగ్నిషన్, కాపీలను తప్పనిసరిగా పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఆదేశించారు.

పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ లేదా యూనిఫాంలను విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే, అట్టి యాజమాన్యాలపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల వివరాలను యూ-డైస్ ప్లస్ పోర్టల్‌లో త్వరితగతిన నమోదు చేయాలని, అలాగే అప్పర్ జనరేషన్ ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ నమోదులో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, వెంటనే ఎంఆర్సీ కార్యాలయంలోని ఎంఐఎస్, సీసీఓలను సంప్రదించి పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కో-ఆర్డినేటర్ నగేష్, సీసీఓ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.