మాజీ ఎమ్మెల్యేకు ‘మాస్ లీడర్’ ఫోటో ఫ్రేమ్ అందజేత

మాజీ ఎమ్మెల్యేకు ‘మాస్ లీడర్’ ఫోటో ఫ్రేమ్ అందజేత

మోత్కూర్, ఆంధ్రప్రభ:
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్‌ను మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ జిల్లా నాయకులు బందెల శ్రీను బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్‌కు ఆయన ‘మాస్ లీడర్’ ఫోటో ఫ్రేమ్‌ను ప్రత్యేకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ సంకినేపల్లి రఘునందన్ రెడ్డి, బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు కల్లెట్లపల్లి శోభన్ బాబు తదితరులు పాల్గొన్నారు.