యువకులు క్రీడల్లో రాణించాలి
యువకులు క్రీడల్లో రాణించాలి
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని జాగిర్యాల్ గ్రామంలో గ్రామంలో విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం స్పాన్సర్ సర్పంచ్ గడల ప్రసాద్ ఉప సర్పంచ్ చేగంటి భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు పొదునూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ గడాల ప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ… చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణిస్తే యువకులకు క్రీడా ఉత్సాహం పెరుగుతుందని నేపథ్యంలో ఆటల పాటల పోటీల ద్వారా మంచి ఆలోచనల విధానం మార్గం పలుకుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చిన్నోళ్ల రాజేశ్వర్ (రాజు), ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ లో పోతునూరు శ్రీనివాస్, సంజీవ్, కళ్యాణ్,హరి క్రీడాకారులు పాల్గొన్నారు.
