వెంకటేశ్వర్లుకు బ్రాంజ్ డిస్క్ అవార్డ్ రావడం పట్ల హర్షం

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ ఫైర్ స్టేషన్‌లో పనిచేస్తున్న జుట్టుకొండ వెంకటేశ్వర్లుకు దేశ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రాంజ్ డిస్క్ అవార్డు లభించింది. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్ ఎస్‌ఐ సుబ్బరాంరెడ్డి ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టర్ జనరల్, ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ & హోం గార్డ్స్ సంస్థ దేశవ్యాప్తంగా అగ్నిమాపక శాఖలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ, అపార ధైర్యసాహసాలు, సమర్పణ భావంతో పనిచేసిన సిబ్బందికి ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రానికి లభించిన 10 అవార్డుల్లో హుజూర్‌నగర్ ఫైర్ స్టేషన్‌కు చెందిన జుట్టుకొండ వెంకటేశ్వర్లుకు బ్రాంజ్ డిస్క్ అవార్డు రావడం గర్వకారణమని జిల్లా ఫైర్ అధికారి వై. కృష్ణారెడ్డి, ఫైర్ స్టేషన్ ఎస్‌ఐ సుబ్బరాంరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది రవిబాబు, దేశ్య నాయక్, నరసింహారావు, శ్రీకాంత్, వెంకటేశ్వరరావు, రామారావు, ప్రశాంత్, శివ, హోమ్ గార్డ్స్ సైదులు, గురవయ్య, వై. సైదులు, శ్రీను, శాంతయ్య, అమృ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
