ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ వరం..
ఏపీ పర్యాటక రంగానికి కేంద్రం భారీ వరం..
రూ.428 కోట్ల నిధుల కేటాయింపు..
ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రాల అభివృద్ధి కోసం..
స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్, శాస్కి, సీబీడీడీ పథకాల ద్వారా మంజూరు…
కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి కృతజ్ఞతలు
( ఆంధ్రప్రభ భవానిపురం) ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద రూ.428 కోట్ల నిధులు మంజూరు చేయడం రాష్ట్రానికి శుభపరిణామమని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి పేర్కొన్నారు. ‘స్వదేశీ దర్శన్ 2.0’, ‘ప్రసాద్’, ‘శాస్కి’, ‘సీబీడీడీ’ వంటి పథకాల ద్వారా అందుతున్న ఈ నిధులు రాష్ట్రంలోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా మారనున్నాయని ఆయన తెలిపారు. ఈ నిధులతో ప్రముఖ దేవాలయాలు, పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు చేపట్టే అవకాశముందని చెప్పారు. పర్యాటక రంగం బలోపేతం కావడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరగడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కూడా విస్తృతంగా లభిస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ధన్యవాదాలు తెలిపారు.
