UDF | కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు
UDF | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : వీడీ సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, డీకే శివకుమార్, తదితరులు హాజరయ్యారు.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 140 స్థానాల్లో పోటీ చేసి 102 చోట్ల విజయం సాధించింది. ఈ విజయంతో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.
