Fake GST bills | రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలుకు!

Fake GST bills | రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలుకు!
Fake GST bills | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : రూ.100 కోట్ల నకిలీ జీఎస్టీ (GST) బిల్లింగ్, మనీలాండరింగ్ రాకెట్ కేసులో పంజాబ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి సంజీవ్ అరోరాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక పీఎంఎల్ఎ (PMLA) కోర్టు సోమవారం ఆయనకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్దిరోజులుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కస్టడీలో ఉన్న మంత్రిని, ఈడీ విచారణ ముగియడంతో కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం ఆయనకు జుడీషియల్ రిమాండ్ విధించింది.
Fake GST bills | అసలు ఏం జరిగింది?
మొబైల్ ఫోన్ల ట్రేడింగ్ పేరుతో షెల్ (నకిలీ) కంపెనీలను సృష్టించి, సుమారు రూ. 100 కోట్లకు పైగా నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టించి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాను మే 9వ తేదీన చండీగఢ్‌లో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మంత్రి అరోరాకు లింకులు ఉన్న కొన్ని సంస్థలు, ఢిల్లీలోని బోగస్ కంపెనీల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ దర్యాప్తులో భాగంగానే గతంలో ఢిల్లీ. ఛండీగఢ్, గురుగావ్ పరిసర ప్రాంతాల్లో ఈడీ విస్తృతంగా సోధాలు కూడా నిర్వహించింది.
Fake GST bills | కోర్టు ఆదేశాలు ఇవే..
కోర్టు విచారణ ప్రారంభానికి ముందు, అరెస్ట్ అయిన తర్వాత మొదటిసారిగా సంజీవ్ అరోరా కుటుంబ సభ్యులు కోర్టు ప్రాంగణంలోనే ఆయనను కాసేపు కలుసుకున్నారు. అంతకుముందు ప్రత్యేక న్యాయమూర్తి నరేంద్ర సురా.. నిందితుడు అరోరా ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి 11 గంటల మధ్య ఒక గంట పాటు తన న్యాయవాదిని కలుసుకునేందుకు ఈడీకి అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా, జైలు వైద్యాధికారి సూచించిన విధంగా ఆయనకు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు, మందులను అందించాలని కోర్టు ఆదేశించింది. తన సొంత న్యాయవాదిని నియమించుకునేందుకు మరియు వకాలత్నమాపై సంతకం చేయడానికి అనుమతించాలంటూ అరోరా దాఖలు చేసిన దరఖాస్తుకు ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైమన్ బెంజమిన్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
దీంతో కోర్టు ఈ విజ్ఞప్తిని స్వీకరిస్తూ, వకాలతానామా పత్రాలను వెంటనే ఆయన లాయర్ లేదా కుటుంబ సభ్యులకు అందజేయాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే జూన్ 1వ తేదీకి వాయిదా వేసింది. పంజాబ్లో సిట్టింగ్ మంత్రి ఒకరు మనీలాండరింగ్ కేసులో జుడీషియల్ కస్టడీకి వెళ్లడం అక్కడి రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
CLICK HERE TO READ MORE : Rs 5 Lakh Baby : అంగట్లో పసిగుడ్లు Andhra Prabha Top Story
