దాతృత్వం చాటుకున్న మిత్ర బృందం

దాతృత్వం చాటుకున్న మిత్ర బృందం

  • రూ. 5.64లక్షల ఆర్థిక సహాయం

కేసముద్రం, ఆంధ్రప్రభ : కేసముద్రం మండలం కలువల లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కందిపాటి రాము కుటుంబానికి గ్రామానికి చెందిన యువకులు భారీ ఆర్థిక సహాయాన్ని అందించారు. హైదరాబాద్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ సిబ్బంది రూ.2.5లక్షలతో పాటు గ్రామానికి చెందిన బొగ్గుల రాజేష్ అతని మిత్ర బృందం కలిసి మొత్తం రూ.5.64లక్షలను సేకరించి ఆదివారం రాము కుటుంబానికి మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ వేల్పుల సుజాత రామచంద్రయ్య, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు గండి శ్రీనివాస్, బొగ్గుల నాగయ్య, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మోడెం రవీందర్ గౌడ్, మూరగుండ్ల యాదగిరి, ఉపసర్పంచ్ పెదగాని రవి, పెరుమాళ్ల ఎల్ల గౌడ్ పాల్గొన్నారు.

Leave a Reply