మహిళల సాధికారతతోనే సమాజ ప్రగతి..
మహిళల సాధికారతతోనే సమాజ ప్రగతి..
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ మహిళలకు శుభాకాంక్షలు
నర్సంపేట, రూరల్ ,ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నియోజకవర్గంలోని మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధికి పునాది వంటివారని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని పేర్కొన్నారు.
మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబన, సమాన అవకాశాలు లభించినప్పుడే సమాజం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం సమృద్ధిని సాధించాలని సూచించారు.
మహిళలు ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని ఆయన అన్నారు.
కుటుంబం, సమాజం మరియు దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళల హక్కులు, సమానత్వం మరియు సాధికారతపై అవగాహన పెంచే రోజు అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని మహిళలందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేశారు.
