విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

విద్యుత్ ప్రమాదాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
- జాగ్రత్తలు పాటిస్తేనే విద్యుత్ ప్రమాదాల నివారించవచ్చు
- చిన్న జాగ్రత్తలు…పెద్ద ప్రమాదాలకు అడ్డుకట్ట
- టీజీఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రత అవగాహన కార్యక్రమం
- పోస్టర్‌ను ఆవిష్కరించిన స్టేషన్ ఘన్ పూర్ విద్యుత్ డిఈ సారయ్య
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : విద్యుత్ ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు, వినియోగ దారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని స్టేషన్ ఘన్‌పూర్ డివి జనల్ ఇంజనీర్ సారయ్య సూచించారు. టీజీఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న విద్యుత్ వారోత్సవాల సందర్భంగా బుధవారం డివి జనల్ ఇంజనీర్ కార్యాలయంలో విద్యుత్ ప్రమాదాల నివారణపై అవ గాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈ సార య్య మాట్లాడుతూ.. వ్యవసాయంలో ఉపయోగించే కరెంటు మోటార్లు, పైపులు, ఫుట్‌వాల్వ్‌లు వంటి పరికరాలను రైతులు నిర్లక్ష్యంగా తాకకూడదు.
విద్యుత్ సరఫరా ఉన్న సమయంలో లేదా తడి పరిస్థితుల్లో వీటిని తాకడం ప్రాణాపాయం కలిగించవచ్చని హేచ్చరించారు. ప్రత్యే కంగా వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. నేల తడిగా ఉండ టం వల్ల విద్యుత్ సులభంగా ప్రసరిస్తుందన్నారు. తెగిపోయిన విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. ఎక్కడైనా విద్యుత్ తీగలు పడిపోయి ఉంటే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
మోటార్లకు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలి:
రైతులు తమ మోటార్లకు సరైన ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని డిఈ సారయ్య తెలిపారు. పాడైన వైర్లు, లూజ్ కనెక్షన్లు ఉంటే వెంటనే మార్చుకోవాలి. పిల్లలు విద్యుత్ పరికరాల దగ్గర ఆడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అనధికా రికంగా ఫ్యూజ్‌లు మార్చడం, కాలిన తీగలను స్వయంగా సరిచేయడం వంటి చర్యలు చాలా ప్రమాదకరం.
ఇలాంటి పనులను కేవలం అర్హత కలిగిన సిబ్బంది మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేశారు. విద్యుత్‌ను సురక్షితంగా వినియోగించడం ద్వారా మాత్రమే ప్రమాదాలను నివారిం చవచ్చని, ప్రతి ఒక్కరూ చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా పెద్ద ప్రమా దాలను నివారించవచ్చని డీఈ సారయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడిఈ లు రణధీర్ రెడ్డి, శ్రీధర్, ఏఈ లు సురేష్, శంకర్, శివ కుమార్ రణధీర్, తదితరులు పాల్గొన్నారు.
