మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత

మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేత
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతిని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందజేశారు. పట్టణంలోని 17వ వార్డులో పవర్ ప్రదీప్ ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న పరకాల పురపాలక సంఘం బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ శనివారం రోజు 17వ వార్డులోని పవర్ ప్రదీప్ వారి కుటుంబాన్ని రేగొండ స్వర్గ్రామంలో పరామర్శించారు.
అనంతరం మృతుని కుటుంబానికి నిత్యవసర సరుకులు అందచేసి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయం మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, బీఆర్ఎస్ 17వ వార్డు అధ్యక్షుడు చెట్ల వెంకటేశ్వర్లు, వార్డు నాయకులు మోటం భద్రయ్య, అడ్వకేట్ సుజయ్, రాయబారపు అనిల్, ఉర్సు మహేష్, ఎండీ అల్తాఫ్, చెట్టి ఏసుదాసు, పల్లెబోయిన రంజిత్, ఒంటేరు రాజ్ కుమార్, దామ శివ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
