నందికొట్కూరు సి.హెచ్.సి తనిఖీ…

నందికొట్కూరు సి.హెచ్.సి తనిఖీ…

నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
“ఆస్పత్రి ఉంది, వైద్యం లేదు” కథనానికి వెంటనే స్పందించిన డీసీహెచ్ఓ
రోగుల పట్ల నిర్లక్ష్యం వద్దు.. సిబ్బందికి డీసీహెచ్ఓ లలిత హెచ్చరిక

నందికొట్క, ఆంధ్రప్రభ : సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల లోపాలపై వెలుగులోకి వచ్చిన కథనానికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఓ.లిత వెంటనే స్పందించారు. ఆదివారం నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైద్యాధికారులు, సిబ్బంది ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అలాగే రోగులతో మర్యాదగా మెలగాలని, ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం నుంచి రోజూ వందలాది మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తున్నారని, పెరిగిన రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఆమె తెలిపారు.తనిఖీలో భాగంగా రికార్డులు పరిశీలించి, రోగులతో నేరుగా మాట్లాడి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

తనిఖీ సందర్భంగా ఆమె సిబ్బందిని ఘాటుగా హెచ్చరించారు. వైద్యాధికారులు, సిబ్బంది ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభ కథనంపై వెంటనే స్పందించినట్లు పేర్కొన్నారు.