రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..

రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి..

  • బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ ; మండలంలోని ముత్యాలమ్మ కుంట గ్రామ పంచాయతీ పరిధిలోని మూసిఓడ్డు తండాకు వెళ్లే రోడ్డు పనులను వెంటను పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ ప్రభుత్వాన్ని కోరారు. శనివారం రోడ్డు పనులను పరిశీలించి తండవాసులతో రోడ్డుపైన కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రోడ్డు వేస్తామని ఉన్న రోడ్డును తవ్వి కంకర పరిచి వదిలివేశారని నాటి నుంచి ఈ రోడ్డుతో గిరిజన నరక యాతన అనుభవిస్తున్నారని తెలిపారు.

గుత్తేదారులకు బిల్లు రాక ప్రభుత్వాన్ని అడిగె ధైర్యం లేక మనోవదన చెందుతున్నారని, ఇది నిజమా కాదా అనే బహిరంగ పరచాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. మరో రెండు సంవత్సరాలలో ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదిలిపోతుందన్నారు. ఈ రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని, రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకోని రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కాంట్రాక్టర్కు ఆదేశించాలని కోరారు. కార్యక్రమంలో మూసిఒడ్డు తండాకు చెందిన దేవులాల్ శివనాయక్, కిషన్, పద్మ, శారద, సైదానాయక్ తదితరులు ఉన్నారు.