మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి

మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి

రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే ప్రజలు తమ పిల్లలను చదివించాలని మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ డ్రైవ్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ఎంపీడీవో విజయలక్ష్మి అధ్యక్షతన వహించారు.

ఈ సంధర్భంగా ఎంఈఓ మల్లికార్జున మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుటకు పాటించవలసిన నియమ నిబంధనలు గురించి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలలు అందించే సౌకర్యాలను నాణ్యమైన విద్యను మరియు ఆహ్లాదకరమైన వాతావరణంలో సౌకర్యవంతమైన పాఠశాలల గురించి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ కార్యక్రమాలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.అలాగే పిల్లలు ఉన్న తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల ఘనత గొప్పతనం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఎం.ఏ డిగ్రీలు చదువుకొని పాసై ప్రభుత్వము పెట్టిన పరీక్షలను కూడా పాస్ అయ్యి ఉద్యోగాల్లోకొచ్చి చదివి చెబుతున్నారని తెలిపారు అందులోను కొంతమంది ఉపాధ్యాయులు గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్లు కూడా ఉన్నారని తెలియజేశారు.ప్రస్తుతం దేశంలో మేధావులు దేశాన్ని పాలించే నాయకులు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న 90 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వాళ్ళెనని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువు చెబుతున్నవాళ్లు చాలామంది ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయ్యి మిడిమిడి జ్ఞానంతో విద్యను బోధిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ-2 కుళ్లాయప్ప క్లస్టర్ హెచ్‌ఎం‌లు ఎంఆర్‌సి సిబ్బంది సిఆర్‌పి లు ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు ఏపిఎం వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.